11-04-2025 06:35:46 PM
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారిని స్మరించుకొని సమాజానికి చేసిన సేవని చదువు పట్ల పేదవాళ్లకి ముఖ్యంగా ఆడబిడ్డలకి చదువు ఎంత ప్రాముఖ్యత ఉందో, మన నుంచి ఆయన దూరమైన చేసిన సేవలను గ్రహించి ఈనాడు తమ ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే పాటు పడుతుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. శుక్రవారం పినపాక నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, శాసనసభ్యులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
బూర్గంపాడు మండలంలోని ఆర్ అండ్ బి రోడ్డు నుండి జెడ్పీ రోడ్డు వరకు గౌతమ్ పూర్ నుండి సోంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి 90 లక్షల వ్యయంతో సిఆర్ఆర్ ప్లాన్ నిధుల నుండి రోడ్డు నిర్మాణానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం తాళ్లగొమ్మూరు దగ్గరలోని ముత్యాలమ్మ తల్లి దేవస్థానమును ముత్యాలమ్మ తల్లి దేవస్థానమును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అశ్వాపురం మండలం సీతారాంపురం ఆర్ అండ్ బి రోడ్డు నుండి బిజీ కొత్తూరు గ్రామం వరకు సుమారు రూ 63 లక్షల అంచనా వ్యయంతో ఎస్ టి ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులను రూ 4.30 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులకు, కుర్షం వారి గూడెం ఆర్ అండ్ బి రోడ్డు నుండి జగ్గారం గ్రామం వరకు సుమారు రూ 1.92 అంచనా వ్యయంతో సి ఆర్ ఆర్ ప్లాన్ నిధులతో బీటీ రోడ్డు పనుల నిర్మాణం, రూ 1. 92 కోట్ల వ్యయంతో గొల్ల కొత్తూరు కాలనీ హైలైవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులను, రూ.1. 50 కోట్ల వ్యయంతో రామానుజ వరము నుండి పగిడేరు రోడ్డు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులకు, పుప్పాక బ్రిడ్జి నుండి పోతిరెడ్డిపల్లి వరకు రూ 96 లక్షల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణం పనులకు, పోతిరెడ్డి పల్లె నుండి క్రింది గుంపు వరకు రూ 80 లక్షల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణం పనులకు, మల్లారం నుండి వెంకటేశ్వరపురం వరకు రూ 1.44 కోట్ల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ఎక్స్ వి ఎఫ్ సి గ్రాంట్ నిధులతో రూ.1.56 కోట్ల వ్యయంతో పినపాకలో నూతనంగా నిర్మాణం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలలోని నిరుపేదలైన కుటుంబాలకు విద్యా, వైద్యం గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కొరకే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. యువతి యువకులకు, మహిళలకు, సన్న కారు రైతుల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 మంది పిల్లలు చదువుకునే విధంగా రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నారని, రాష్ట్రం మొత్తానికి రూ.11,600 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు.
పినపాక మండలంలోనీ చుట్టుపక్కల ఉన్న నిరుపేదలైన కుటుంబాలకు డాక్టర్లు కానీ దయచేసి ఇబ్బంది కానీ రోగుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండి వారికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి తగినన్ని మందులు అందజేయాలని, ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలలో పనిచేసే వైద్య సిబ్బంది వారి విధులను సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.