13-04-2025 07:42:32 PM
కల్లూరు,(విజయక్రాంతి): మండలం పేరువంచ గ్రామంలో గామ్ చలో-బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ తమిళనాడు కర్ణాటక సహకో ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పేరువంచ మెయిన్ సెంటర్ నందు జండా ఆవిష్కరణ చేసి అనంతరం తాను చదువుకున్న హై స్కూల్ ఆవరణ ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు అక్కడున్న స్కూలు సమస్యలు అడిగి తెలుసుకోని వెంటనే స్పందించి 1,00116 (లక్షా నూట పదహారులు) స్కూల్ కమిటీకి ఇవ్వడం జరిగింది.
కార్యకర్తలకి గ్రామ పెద్దలకి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని ప్రజలతో నిత్యం అనుబంధాన్ని కొనసాగించే పార్టీ అని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని రాజ్యాంగాన్ని ఎప్పుడు గౌరవించే పార్టీ అని మాట్లాడడం జరిగినది.