24-02-2025 12:00:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి కుమార్తె వివాహానికి, కోదాడలో జరిగిన మైసా శంకర్ కుమారుని వివాహానికి హాజరయ్యారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలు ప్రైవేట్ కార్యక్రమా ల్లోనూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.