calender_icon.png 15 January, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగులేటి నైతిక బాధ్యత వహించాలి

13-01-2025 01:45:28 AM

మానకొండూరు, జనవరి 12 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి  గ్రామంలో వరద కాలువ గండికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని మాన కొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా తోటపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ d4 కాలువ గండి పడింది.

దీంతో భారీగా నీరంతా ఇండ్లలోకి రావడంతో జలమయమయింది. సంక్రాంతి పండుగ పూట సంతోషంగా ఉండాల్సిన ప్రజలు వరద నీటిలో పస్తులుండే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం కూలింది పనికి రాదన్న పొంగులేటి ఈ కాల్వ గండికి బాధ్యత వహించాలని అన్నారు. పొంగులేటి సొంత కంపెనీ అయిన రాఘవ కన్ స్ట్రక్షన్ ద్వారానే ఈ కాల్వ నిర్మాణం జరగడం వల్లనే గండి పడిందని స్పష్టం చేశారు.

పంటలు మునిగి,ఇళ్లలో సామాగ్రి తడిసిపోయి నష్టం వాటిల్లిన బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప తాను చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.మన్నెంపల్లి కాల్వ గండి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఎమ్మెల్యే బాధితులకు పరిహారం అందించి చిత్తశుద్ధి నిరూపించు కోవాలని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాస్తవాలు మాట్లాడే మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీ చేసిన పనికి పొంగులేటి బాధ్యత వహించాలన్నారు.గతంలో ఇలాంటి ఘటన జరిగితేనే వెంటనే మరమ్మతులు చేయించామని ప్రస్తుతం ఎమ్మెల్యే అధికారులు తోతూ మంత్రంగా వచ్చి పరామర్శించారు తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ పూట దళిత, బీసీ కాలనీలు తమ పిల్లల్ని జలమయంతో నిండి చెరువులా తలపించడంతో పండుగ పూట మన్నెంపల్లి గ్రామస్తులు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందన్నారు.