calender_icon.png 10 November, 2024 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో నేడు పొంగులేటి భేటీ

21-09-2024 12:46:45 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉదయం 11 గంటలకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. నూతన రెవె న్యూ చట్టం ముసాయిదాను ఇప్పటికే ప్రజల ముందు పెట్టిన ప్రభు త్వం త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి పొంగులేటి భేటీ ప్రాధాన్యత సంతరిం చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, రెవె న్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు రెవెన్యూ శాఖ బలోపేతమవుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.