14-04-2025 12:39:35 AM
కల్లూరు, ఏప్రిల్ 13 :-మండలంలోని పేరువంచ గ్రామంలో ఆదివారం గాం చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ తమిళనాడు, క ర్ణాటక సహ కో ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పేరువంచ మె యిన్ సెంటర్ లో జండా ఆవిష్కరణ చేసి అనంతరం తాను చదువుకున్న హై స్కూల్ ఆవరణ ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు అక్కడున్న స్కూలు సమస్యలు అడిగి తెలుసుకోని వెంటనే స్పందించి రూ.1,00 116 స్కూల్ కమిటీకి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరు కోటేశ్వరావు, కల్లూరు మండలం అధ్యక్షులు బొమ్మ రామకృష్ణ , భారతీయ జ నతా పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు సన్నె ఉదయ ప్రతాప్, గోంగూర వెంకటేశ్వర్లు, నున్న రవి, జిల్లా మండల నాయ కులు, గ్రామం పంచాయితీ నాయకులు మండవ వెంకట రామిరెడ్డి, అనంగి నరసింహారావు,కల్లేపల్లి బీమరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.