calender_icon.png 25 October, 2024 | 1:44 AM

పొంగులేటికి అర్హత లేదు

23-07-2024 01:18:52 AM

మంత్రిగా కొనసాగకూడదు

బ్యాంకు స్కామ్‌లో పొంగులేటి కంపెనీ

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్, జూలై 22 (హైదరాబాద్): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.  ఆయన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్,, యూరో ఎగ్జిమ్ బ్యాంకు కుంభకోణంలో భాగస్వామి అని ఆరోపించారు. అందువల్ల ఆయనకు మంత్రిమండలిలో ఉండే అర్హత లేదని అన్నారు.

రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిమ్ బ్యాం క్ లేనేలేదని, ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి బ్యాంకును నడుపుతూ మోసానికి పాల్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియాహాల్‌లో మాట్లాడుతూ.. వెంటనే బ్యాంక్ గ్యారెంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణ ంలోని 400 మంది కాంట్రాక్టర్ల పేర్లు త్వరలోనే బయటపెడతానని స్పష్టంచేశారు. దీని పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇది దేశంలోనే భారీ కుంభకోణమని, ఇందులో చాలా మంది బడా కాంట్రాక్టర్లతో పాటు పొంగులేటి ప్రమేయం ఉందన్నారు. అక్రమాలకు సంబంధించిన చాలా ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు.