calender_icon.png 17 January, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్ పరిధిలో 490 చెరువులు కబ్జా!

27-08-2024 12:11:39 AM

రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ నివేదికలో వెల్లడి

చర్యలు తీసుకోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ 

నోటీసులకే పరిమితమైన హెచ్‌ఎండీఏ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హైడ్రా ఏర్పడిన నెలరోజుల్లోనే దాదాపు 43 ఎకరాలకు పైగా చెరువు లు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ప్రజాప్రతినిధులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నారు.

అయినా పట్టించుకోకుండా కూల్చివేతలు చేస్తుండటంతో హైడ్రాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఇదిలా ఉండ గా, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సం స్థ (హెచ్‌ఎండీఏ) ఆవిర్భవించి 16 ఏళ్లు అవుతున్నది. హైదరాబాద్ మహానగరం చుట్టూ 7 జిల్లాల పరిధిలో విస్తరించి హెచ్‌ఎండీఏ విస్తరించి ఉన్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు కబ్జాకు గురవుతున్నా హైడ్రా తరహాలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేప ట్టలేపోయిందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీజీఆర్‌ఏసీ) ఓఆర్‌ఆర్ పరిధిలో మొత్తం 920 చెరువులు, కుంటలకు 490 చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్టుగా ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అంద జేసింది. 

కబ్జా అయిన చెరువులు 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2014కు ముందు 417 చెరువులు, కుంటలు ఉన్నా యి. వీటిలో 182 కుంటలు పూర్తిగా ఆక్రమణలకు గురికాగా, మరో 76 చెరువులు, కుంటలు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్టు టీజీఆర్‌ఏసీ తన నివేదికలో వివరించింది. గ్రేటర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మొత్తం 503 చెరువులు, కుంటలు ఉండగా, అందులో 62 చెరువులు పూర్తిగా, మరో 102 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్టుగా ఆ నివేదిక తెలిపింది.

ఓఆర్‌ఆర్ పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా.. 282 పూర్తిగా,  మరో 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్టు ఉపగ్రహ చిత్ర పటాలు, సర్వే ఆఫ్ ఇండియా వారి టోపోషీట్‌ల రిమోట్ సెన్సింగ్ పరిశీలనలో స్పష్టమైంది. 2014 నుంచి 2023 వరకు గ్రేటర్‌లోని 417 చెరువుల్లో 11 చెరువులు పూర్తిగా, మరో 7 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయి. గ్రేటర్ నుంచి ఓఆర్‌ఆర్ దాకా 503 చెరువుల్లో 27 చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాగా, మరో 24 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్టు టీజీఆర్‌ఏసీ తేల్చింది. వీటిలో 56 చెరువులు ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో అనే విషయంపై హైడ్రా కమిష నర్ ఏవీ రంగనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల మీడియాకు వివరించారు. 

చెరువుల రక్షణకు చర్యలు శూన్యం

హెచ్‌ఎండీఏ 2008లో ఏర్పడగా.. 2010 నుంచి హెచ్‌ఎండీఏ పరిధిలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అందుబాటులోకి వచ్చింది. అయినా కూడా ఆక్రమణలకు గురైన చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోలేదు. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి చైర్మన్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్ వ్యవహరిస్తుండగా, ఎంఏయుడి సెక్రటరీ స్పెషల్ కమిషనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, పరిశ్రమలు, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, పంచాయతీరాజ్, పీసీబీ విభాగాలతో పాటు 7 జిల్లాల కలెక్టర్లు, అధి కారులు సభ్యులుగా ఉంటారు.

ఇప్పటిదాకా హెచ్‌ఎండీఏ మొత్తం 3,532 చెరువుల్లో 2,540 చెరువుల పరిరక్షణకు ప్రిలిమినరీ నోటీసులు, 230 చెరువుల పరిరక్షణకు ఫైనల్ నోటీసులను జారీ చేసింది. ఈ నెల 1నుంచి 23 వరకు 60 చెరువులపై సర్వే చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలకు చెందిన మరో 80కి పైగా చెరువుల పరిరక్షణకు ప్రిలిమినరీ నోటీసులు జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్ప టికైనా హెచ్‌ఎండీఏ పరిధిలో ఆక్రమణలకు గురైన వందలాది చెరువుల పరి రక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.