మట్టి వినాయక విగ్రహాలే మేలు : జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల,(విజయక్రాంతి): ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలతో చెరువులలో నీరు కలుషితమై పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో మట్టి వినాయకులను ఉపయోగించి చెరువులను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పిలుపు ఇచ్చారు. ఇందుకు సంబందించిన పోస్టర్లను జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పోస్టర్ల కలెక్టర్ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ... వినాయక చవితి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి ఏటా గణేష్ చతుర్థికి మట్టివినాయక విగ్రహలను ఉపయోగించాలని ప్రతి జిల్లాకు పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో జగిత్యాల జిల్లాకు 2000 మట్టి వినాయకులను పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ, తెలంగాణ కాలుష్యం నియంత్రణ మండల తరపున కనకజ్యోతి,అసిస్టెంట్ సహాయ శాస్త్రవేత్త, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్, డిడబ్ల్యూఓ భోనగిరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.