- కరీంనగర్ జిల్లాలో కబ్జాల పర్వం
- కబ్జాదారుల చెరలో చెరువు శిఖం భూములు
- ‘హైడ్రా’ వంటి వ్యవస్థ కోరుతున్న జిల్లావాసులు
కరీంనగర్, ఆగస్టు 26 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు నగరానికి అనుకుని ఉన్న చెరువులు క బ్జాకు గురవుతున్నాయి. జి ల్లావ్యాప్తంగా 19,457 హెక్టార్లలో 1,023 వరకు చెరువులు, కుంటలు ఉండగా, ప్రధాన చెరువులు మినహా శివారులోని చెరువులు, చెరువు శిఖం భూములు అన్యాక్రంతమయ్యాయి. అక్కడ ఇప్పటికే కట్టడాలు వెలిశాయి. రేకుర్తి పరిధిలోని సర్వే నెం.227లో నద్దినాలను ఆనుకుని 20 గుంటల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణదారులు కట్టడాలు నిర్మించారు.
దీని పక్కనే రజకులకు 228 సర్వే నెంబర్‌లో కేటాయించిన మడేలేశ్వర స్వామి ఆలయ సమీపంలోనూ కట్టడాలు వెలిశాయి. అల్గునూరులోని మామిడికుంట చెరువు శిఖం, ఆరెపల్లిలోని మానుకుంట, ఉడత కుంటలు, బొమ్మకల్‌లోని జక్కప్ప చెరువు, గోపాల్ చెరువు, నల్ల చెరు వు, గోధుమకుంట, రావికుంట చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. తీగలగుట్టప ల్లి పరిధిలోని ఊరకుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమార్కులు భవనాలు నిర్మించారు. అలాగే కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం, బస్టాండ్, కలెక్టరేట్ ప్రాంతాలూ చెరువు భూ ములే. చెరువును మాయం చేసి ఇక్కడ భవ న సముదాయాల నిర్మాణం జరిగింది.
జ్యో తినగర్, వావిలాలపల్లి ప్రాంతా ల్లో చెరువులు మాయమై ఇప్పటికే వెంచర్లు వెలిశా యి. ఎల్‌ఎండీ వద్ద కూడా కబ్జా ప్రయత్నాలు కొనసాగుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి ఆనుకుని ఉన్న కొ త్తపల్లి పెద్ద చెరువు చిన్న చెరువుగా మారిపోతున్నది. చెరువు చుట్టూ కబ్జాలు జరుగుతు న్నాయి. గత ప్రభుత్వం ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్ చేస్తామని పనులు మొదలు పె ట్టి మధ్యలోనే ఆపింది. 200 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు కరీంనగర్ నగర ప్రజలు ఊట చెరువుగా భావిస్తారు. హైదరాబాద్‌లో ‘హైడ్రా’ అందుబాటులోకి వచ్చినట్లు కరీంనగర్‌కూ అలాంటి అథారిటీ వస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
మట్టి దందా..
కరీంనగర్ జిల్లాలోని ఎల్‌ఎండీ నుంచి మొదలు పలు చెరువుల్లో మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. సర్కార్ నుంచి అనుమతులు తీసుకున్నదానికంటే అక్రమార్కులు రెండింతలుగా తోడి ప్రైవేట్ వెంచర్లు, ఇటుకబట్టీల ప్రాంతంలో ఖాళీ అయిన ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కోట్లు గడిస్తున్నారు. జమ్మికుంట, ఖాజీపూర్, బొమ్మకల్, మానకొండూర్, ఎల్‌ఎండీ తదితర ప్రాంతాలకు ఎక్కువగా మట్టి వెళ్తున్నది.
అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదు
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. చెరువు లు ఎక్కడెక్కడ ఆక్రమణ కు గురయ్యా యో విచారించి గ్రామస్తులు, పట్టణవా సులు తగిన ఆధారాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలి. చెరువులను ఆక్రమించి ఎవరైనా కట్టడాలు నిర్మిస్తే, వాటిని కచ్చితంగా కూల్చివేస్తాం.
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్