calender_icon.png 8 January, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాండిచ్చేరి.. సోయగాలు!

06-01-2025 12:00:00 AM

ఆధ్యాత్మిక వాతావరణం, అందమైన బీచ్‌లు, ఫ్రెంచ్ సౌందర్యం ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. పాండిచ్చేరిలో ఫ్రెంచ్ సంస్కృతి కనిపిస్తుంది. అం తేకాదు ఒక పక్క కాగితం పూలు బోగన్ విలియాలు అల్లుకున్న కొలొనియల్ కాలనీలు, మరో పక్క అంతర్జాతీయంగా పేరుపొందిన అరబిందో ఆశ్రమం మరో పక్క పర్యాటకుల సందడి. పాండిచ్చేరి అందాలను తిలకించడానికి రెండు కళ్లు సరిపోవు. హెరిటేజ్ వాక్, కడలి అందాలను చూస్తూ కాఫీ తాగడం ఓ మధురానుభూతిని కలిగిస్తాయి.  

ఇక్కడ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం ఒక బ్రోచర్ అందిస్తారు. ఆ బ్రోచర్ చూస్తే పర్యాటకులు ఏఏ ప్రదేశాలు చూడాలన్నది సులభం అవుతుంది. అకామిడేషన్, సైట్ సీయింగ్, షాపింగ్ వివరాలన్నీ అందులో ఉంటాయి.

ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫ ర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ప్రతిరోజూ సాయం త్రం నాలుగు గంటలకు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తా రు. ఈ నడక లీ కెఫె నుంచి మొదలవుతుంది. ఈ వాక్ చాలా అద్భుతంగా టౌన్‌లోని ఫ్రెంచ్, తమిళ క్వార్టర్లను చూడొచ్చు. దారి పొడవునా అద్భుతమైన ఫ్రెంచ్ కాలం నాటి రొమెయిన్ రొలాండ్ పరిపాలన, పరిసరాల్లోని పెద్ద పెద్ద చెట్లు దర్శనమిస్తాయి. పాండిచ్చేరిలో చూడాల్సిన అద్భుతమై న ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని..  

అరబిందో ఆశ్రమం

పుదిచ్చేరిలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం అరబిందో ఆశ్రమం. 1926లో దీన్ని స్థాపించారు. ఈ ఆశ్రమంలో అరబిందోతో పాటు, తల్లి మీరా అల్ఫాసా సమాధులు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకు పర్యాటకుల కోసం అరబిందో, మదర్ లా వీడియోలను ప్రదర్శిస్తారు. ఇంకా ఈ ఆశ్రమంలో హ్యాండ్లూమ్ వస్తువులు, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, లైబ్రరీ క్రాప్ట్ సెంటర్లలో పర్ఫ్యూమ్స్, హెర్బల్, ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంటాయి. హ్యాండ్ ప్రింట్ స్కిల్ చీరలు, స్కార్ఫ్‌లు కూడా చాలా అందంగా సరసమైన ధరలతో ఉంటాయి. 

మ్యూజియం

ఆర్ట్ అండ్ హిస్టరీ అంటే ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ మ్యూజియం ఓ పండగలాంటిది. అద్భుతమైన శిల్పకళాకృతులు, చెత్తో తయారు చేసిన బొమ్మలు, ఫ్రెంచ్ పాలననాటి నాణేలు, పురావస్తు తవ్వకాల్లో బయటపడిన రకరకాల వస్తువులు ఈ మ్యూజియంలో ఉంటాయి. 

బొటానికల్ గార్డెన్

అందమైన ఫౌంటెన్లు, అతి పెద్ద అక్వేరియం, జపనీస్ రాక్, డాన్సింగ్ ఫౌంటెన్, చిన్న పిల్లల ట్రైన్ ఈ బొటానికల్ గార్డెన్ ప్రత్యేకతలు. సుమారు 22 ఎకరాలున్న ఈ గార్డెన్ 1500 రకాల మొక్కలున్నాయి. సాయంత్రాల్లో మాత్రమే ఫౌంటెన్స్ షోలు జరుగుతుంటాయి. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంటుంది. 

గంగైకొండ చోళపురం

పాండిచ్చేరి దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శివాలయం ఒకటి ఉంది. తంజావురులోని ప్రసిద్ధి చెందిన బృహదీశ్వరాలయం తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన రెండో శివాలయం ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సంవత్సరం మొత్తంలో ఏ ఒక్క రోజూ కూడా గోపురం నీడ నేల మీద పడకపోవడం ఈ శివాలయం నిర్మాణ చాతుర్యం. 

చిదంబరం

పాండిచ్చేరికి తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో చిదంబరం ఉంటుంది. ఇది తప్పనిసరిగా చూడదగ్గ ప్రదేశం. మంగడం పట్టులో ఉన్న ఈ రాతి దేవాలయం మంగడం పట్టు త్రిమూతర్తి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎటువంటి ఇటుక, కలప, లోహం ఉపయోగించకుండా పూర్తిగా కొండలో తొలిచిన దేవాలయం ఇది. 

ఎలా వెళ్లాలి

హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి 650 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇ క్కడికి వెళ్లడానికి ట్రైన్ సౌకర్యం కూడా అం దుబాటులో ఉంది. ట్రైన్‌లో పాండిచ్చేరి చే రుకోవడానికి 16 గంటల సమయం పడుతుంది. ఫ్లుటైలో అయితే హైదరాబాద్ నుం చి రెండు గంటల సమయం పడుతుంది. అలాగే తమిళనాడులోని కోయంబత్తూరు, చెన్నై, మదురై వంటి వివిధ ప్రాంతాల నుం చి బస్సులు అందుబాటులో ఉంటాయి.