calender_icon.png 27 January, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలీసెట్ 20,862 సీట్లు భర్తీ

13-07-2024 12:34:16 AM

తుది విడుత సీట్ల కేటాయింపు

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): టీజీ పాలీసెట్ తుది విడుత సీట్లను విద్యార్థులకు అధికారులు శుక్రవారం కేటాయించారు. 20,862 (70.46 శాతం) సీట్లు భర్తీ చేశారు. మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు 57 ఉండగా, వీటిలో 13,692 సీట్లకు 11,461 (83.7 శాతం) భర్తీ అయ్యా యి. 2,231 సీట్లు మిగిలిపోయాయి. 57 ప్రైవేట్ కాలేజీల్లో 15,918 సీట్లకు 9401 (59.05 శాతం) భర్తీకాగా, 6,517 సీట్లు మిగిలాయి. మొత్తంగా రాష్ట్రంలోని 114 కాలేజీల్లో 29,610 సీట్లకు 20,862 (70.46 శాతం) భర్తీ అయ్యాయి. నాలుగు ప్రభుత్వ, ఒక ప్రైవేట్ కాలేజీలో వంద శాతం సీట్లు నిండాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 648 మందికి సీట్లు కేటాయించారు. ఈ నెల 15 వరకు ఫీజు చెల్లించి 16లోపు సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.