19-03-2025 12:57:33 AM
హైదరాబాద్ (విజయక్రాంతి): వచ్చే విద్యాసంవత్సరానికి గానూ పాలిటెక్నిక్ కోర్సు ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. మే 13న పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలు కానుంది. కాగా దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 19గా నిర్ణయించారు.