calender_icon.png 4 April, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభం

03-04-2025 07:57:58 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని స్టేషన్ బస్తీలో గల ప్రియదర్శిని హైస్కూల్ లో ఏర్పాటు చేసిన శ్రీ గురుదత్త పాలిసెట్, బ్రిడ్జి కోచింగ్ సెంటర్ ను గురువారం సాహితీ కళాశాల డైరెక్టర్ యంసీ. నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... శ్రీ గురుదత్త పాలిసెట్, బ్రిడ్జి కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విద్యార్థులు శ్రద్దతో పాలిసెట్, బ్రిడ్జి కోచింగ్ తీసుకోని మంచి ర్యాంక్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుదత్త పాలిసెట్, బ్రిడ్జి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వంగపండ్ల మహేందర్, పి. లక్ష్మణ్, పి. విజయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.