కరీంనగర్, జనవరి 1 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసి స్టెంట్గా పనిచేస్తున్న పొల్సాని శ్రీనివాసరా వును ఏసీటీవో (సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి)గా పదోన్నతి కల్పిస్తూ బుధ వారం ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వు లు జారీ చేశారు. ఏసీటీవోగా పదోన్నతి పొందిన శ్రీనివాసరావుకు ఉద్యోగ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.