calender_icon.png 3 October, 2024 | 11:59 AM

కాలుష్యం కోరల్లో పాశమైలారం

02-10-2024 02:14:05 AM

సంగారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : పాశమైలారం ప్రారిశ్రామిక వాడ కాలుష్యాన్ని వెదజల్లుతోంది. గ్రామసీమలను కలుషితం చేస్తున్నది. గ్రామస్తుల ఆరోగ్యాన్ని కబళిస్తున్నది. ఇక్కడి భారీ, మధ్య తరహా పరిశ్రమలు వెలువరించే పొగ, రసాయన వ్యర్థాలతో ప్రజలు వారి ఆయు ప్రమాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు చిన్న పిట్ట కూడా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది.

ఇక్కడి ఓ టైర్ల ఫ్యాక్టరీలో సిబ్బంది కాలుష్య నివారణ ప్రమాణాలు పాటించకుండా పాత టైర్లను కాలుస్తుండడంతో విషవాయువులు బయటకు వస్తున్నాయి. స్థానికంగా ఓ ఫార్మా కంపెనీ యజామాన్యమైతే క్లినికల్ ట్రయల్స్‌కు వినియోగించే పరికరాలను సైతం ఆరుబయటే డంప్ చేస్తున్నది.

గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాంతంలో హరితహారం అమలు చేసింది. అధికారులు ప్రజ లతో విరివిగా మొక్కలు నాటించారు. కానీ, ఫ్యాక్టరీలు వెలువరించే రసాయనిక వ్యర్థా లు, పొగ కలిగించే  నష్టాన్ని నివారించేందుకు ఆ చెట్లు ఏమాత్రం చాలవు. ఇప్ప టికైనా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.