- రైస్ మిల్లులతో దెబ్బతింటున్న పంటలు
- తొలగించాలని రైతుల డిమాండ్
త్రిపురారం, ఫిబ్రవరి 4 : నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ శివారులోని రైస్మిల్లుల నుంచి వస్తున్న దుమ్ముధూళి కారణంగా వరి పొలాలు దెబ్బతింటున్నాయి. ఏడాదిగా దిగుబడి తగ్గి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముధూళి కారణంగా ఇళ్లలో ఉండలేకపోతున్నాయని పరిసర కాలనీవాసులు వాపోతున్నారు.
రైస్మిల్లులు ఏర్పాటు చేసిన స్థలం కంపసాగర్ సాగర్ గ్రామ శివారులో ఉండడంతో ప్రజాభిప్రాయ సేకరణ అక్కడే నిర్వహించారు. కాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తమ అభిప్రాయం తీసుకోలేదని త్రిపురారం దుబ్బ, ఇందిరమ్మ కాలనీవాసుల ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మిల్లుల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.