calender_icon.png 25 February, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ కాలనీలో కలుషిత నీరు

25-02-2025 02:02:51 AM

ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి24: మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో కలుషిత నీరుతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాలనీ కి సంబంధించిన వాటర్ ట్యాంకు శుభ్రం చేయకుండా అవే నీటిని కాలనీకి సరఫరా చేయడంతో నీరు పూర్తిగా పసుపు రంగులో మారి దుర్వాసన వస్తున్నాయని స్థానికులు తెలిపారు. పరిశుభ్రత లేని నీటి ద్వారా అనేక రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని,అనారోగ్య బారిన పడక ముందే పాలకవర్గం చర్యలు తీసుకొని ట్యాంక్ ను శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.