calender_icon.png 12 February, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి

11-02-2025 10:09:42 PM

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ నిర్వహించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం (విజయక్రాంతి): జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి ఆన్ లైన్ ద్వారా పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ... జిల్లాలో 577 గ్రామ పంచాయతీలు, 5266 వార్డుల పరిధిలో మొత్తం 5284 పోలింగ్ కేంద్రాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 

ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి, ఓ.పి.ఓ. లతో పోలింగ్ బృందాలను 20 శాతం బఫర్ తో కలిపి ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఖమ్మం జిల్లాలో మొత్తం 6349 మంది పోలింగ్ అధికారులు, 7898 ఓ.పి.ఓ. లను ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ వినియోగించుకొని పారదర్శకంగా మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ఎన్నికల కమీషన్ కేటాయించిన ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, అర్డిఓలు నరసింహా రావు, ఎల్. రాజేందర్, జెడ్పి డిప్యూటీ సి.ఈ.ఓ. నాగ పద్మజ, డి.ఎల్.పి.ఓ. రాంబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.