25-02-2025 12:07:17 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మెదక్-, నిజామాబాద్,- ఆదిలాబాద్-, కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎం.ఎల్.సి. ఎన్నిక లలో భాగంగా ఈ నెల 27వ తేదీన జిల్లాలో జరుగనున్న పోలింగ్ ప్రక్రియను పారదర్శ కంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమ వారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, అదనపు ప్రిసైడింగ్ అధికా రులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరయ్యారు.