calender_icon.png 29 January, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర, జార్ఖండ్ పోలింగ్ ప్రశాంతం

21-11-2024 02:17:33 AM

ఓటర్ల అనాసక్తితో మందకొడిగా పోలింగ్

౬౫ శాతం ఓటింగ్ నమోదు

జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు పూర్తి

6౮ శాతం నమోదైన పోలింగ్

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు పూర్తయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగగా 4,136 మంది బరిలో నిలిచారు. రాష్ట్రంలో అధికార, విపక్ష కూటములు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఎన్నికల్లో ప్రజలు మాత్రం అంత ఆసక్తి చూపలేదు. చాలా మంది ప్రజలు పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఫలితంగా పోలింగ్ మందకొడిగా సాగింది. పోలింగ్ ముగిసే సమయానికి ౬౫ శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. నగరాల్లో ఓటర్లు మరోసారి నిరాశే మిగిల్చారు. 

113 ఏళ్ల మహిళా ఓటరు

ముంబైలో నివాసం ఉంటున్న 113 ఏళ్ల కాంచన్‌బెన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎంతో ముఖ్యమో తెలియజేస్తూ పలువురిలో ఆమె స్ఫూర్తి నింపారు. మహారాష్ట్రలో ప్రముఖులు పోలిం గ్ కేంద్రాలకు పోటెత్తారు. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్, బాలీవుడు నటులు అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ సైఫ్ రకుల్‌ప్రీత్‌సింగ్ దంపతులు ఓటు వేశారు. 

జార్ఖండ్‌లో రెండో దశ 

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో విడతలో చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ ప్రక్రియలో జన చైతన్యం కనిపించింది. రెండో దశలో భాగంగా 28 సెగ్మెంట్లకు ఓటింగ్ జరగగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి మరీ పోలింగ్ నిర్వహించారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 6౮.౪౫ శాతం ఓటింగ్ శాతం నమోదైంది. జార్ఖండ్‌లోని 81 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 13న 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగగా 66.18 శాతం పోలింగ్ నమోదైంది. తుది దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెచ్చిపోయిన మావోలు

జార్ఖండ్‌లో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు మావోయిస్టులు రెచ్చిపోయారు. లతేహార్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఐదు ట్రక్కులను నక్సల్స్ తగలబెట్టారు. బుధవారం తెల్లవారుజామున బొగ్గు రవాణా ట్రక్కులను చుట్టుముట్టి దాడులకు తెగబడ్డారు. జేసీపీ దళ సభ్యులు ట్రక్కులను నిప్పు అంటించినట్లు అధికారులు తెలిపారు.