న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Delhi Assembly election 2025) బుధవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల బరిలో 699 మంది అభ్యర్థులు పొటీపడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 1.56 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కించ నున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 13.766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారామిలిటరీ దళాలతో భద్రతా ఏర్పాటు చేశారు. 35,626 మంది పోలీసులు, 19 వేల హోంగార్డులతో భద్రత ఏర్పాట్లలో పాల్గొన్నారు. 6,980 మంది ఓటర్లు ఇప్పటికే ఇంటి నుంచి ఓటు వేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(President Droupadi Murmu) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. నిర్మాణ్ భవన్ లో రాష్ట్రపతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.