28-02-2025 01:38:07 AM
నల్లగొండ, ఫిబ్రవరి 27 ( విజయక్రాంతి) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ జిల్లాలో 4,683 మంది, సూర్యాపేట జిల్లాలో 2,664 మంది, యాదాద్రి జిల్లాలో 984 మంది ఉపా ధ్యాయ ఓటర్లున్నారు. వీరికోసం ఉమ్మడి జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 4,433 మంది, సూర్యాపేట జిల్లాలో 2,530 మంది, యాదాద్రి జిల్లాలో 950 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
నల్ల గొండ, సూర్యాపేట జిల్లాలో 94 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కాగా యాదాద్రి జిల్లాలో ఏకంగా 96.54 శాతం నమోదైంది. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి 3 జిల్లాల్లో (కొత్త 12 జిల్లాలు) యాదాద్రిలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడం విశేషం. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నా నానికి ఊపందుకుంది. ఉదయం 10 గంట ల నుంచి 12 గంటల వరకు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 16 శాతం ఓటింగ్ నమోదు కాగా నల్లగొండలో 20 శాతం నమోదైంది. నల్లగొండ ఎన్జీ కళాశాల,
సూర్యాపేట ఏవీఎం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు అన్ని కేంద్రాల్లో పోలింగ్ ముగించారు. ఎక్కడా అవాంఛనీ య ఘటనలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్స్లను కట్టుదిట్టమైన భద్రత నడుమ నల్లగొండ ఆర్జాలబావి సమీపం లోని వేర్హౌస్ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. బ్యాలెట్ బాక్స్లో్ల నిక్షిప్తమైన ఉన్న అభ్యర్థుల భవితవ్యం మార్చి 3న తేలనుంది. మొత్తం 19 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఓటిం గ్ భారీగా నమోదు కావడంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
సూర్యాపేట, ఫిబ్రవరి 27( విజయక్రాం తి): నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రశాంతంగా ముగిసాయి. జిల్లాలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాలలో 2664 ఓటర్లు ఉండగా, పోలింగ్ ముగిసేవరకు 2530 ఓటర్ తమ ఓటును వినియోగించుకున్నారు. జిల్లాలో 94 శాతం పోలింగ్ నమోదయింది .మార్చి 3 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు
ఎన్నికల పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 27 (విజ య క్రాంతి): వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ తీరును యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కలెక్టర్ వీరారెడ్డిలు పోలింగ్ స్టేషనులను పరిశీలించారు. భువనగిరి పట్టణంలో ప్రభు త్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన 124 పోలింగ్ స్టేషన్ను, యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 128 పోలింగ్ స్టేషన్ను,
భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 137 పోలీస్ స్టేషనులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించి ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఆలేరు పట్టణం లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటుచేసిన 129వ పోలింగ్ బూత్ ను జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి వీరారెడ్డి పరిశీలించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా విధుల ను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.