calender_icon.png 24 December, 2024 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కువ కొత్త ఓట్లు నమోదు, తొలగింపు అయిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలి

23-12-2024 11:48:08 PM

సూర్యాపేట: ఎక్కువగా కొత్త ఓట్లు నమోదు, తొలగింపు అయిన పోలింగ్ కేంద్రాలను ఈఆర్‌ఓలు పరిశీలించి కారణాలు తెలుసుకోవాలని రోల్ అబ్జర్వర్, బీసీ వెల్పేర్ కమీషనర్ బి.బాలమాయదేవి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి స్పెషల్ సమ్మరి రివిజన్ 2025పై జిల్లాలోని ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మరణించిన వారి ఓట్లు మరణ దృవీకరణపత్రం, వారి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ కానీ తీసుకుని తొలగించాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి ఎపిక్ కార్డులు పంపణీ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

సూపర్ చెకింగ్ పారంలను త్వరగా పరిష్కరించాలన్నారు. ఓటర్ జాబితాలో ఉన్న పోటోలను జాగ్రత్తగా పరిశీలించి నిర్దారించుకోవాలన్నారు. తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 1205 పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్‌లు 5,15,617 మంది, పురుష ఓటర్‌లు 4,92,446 మంది మొత్తం కలిపి 10, 08,120 మంది ఓటర్‌లు ఉన్నారన్నారు. ఓటర్ జాబితాపై పలుమార్లు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్‌డీఓలు వేణుమాదవ్, సూర్యనారాయణ, ఎలక్షన్ సూపరింటెండ్ శ్రీనివాసరాజు, వేణు, పలువురు తాహసీల్దార్‌లు, ఎలక్షన్ డీటీలు పాల్గొన్నారు.