calender_icon.png 24 October, 2024 | 3:50 PM

పోల్కీ వజ్రాల హారం

04-06-2024 12:05:00 AM

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా మే 14న ప్రారంభమై 25న ముగిసింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు వివిధ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, సినీ తారలు వచ్చి రెడ్ కార్పెట్‌పై తళుక్కుమని మెరిశారు. చాలా రకాల డిజైనర్‌వేర్‌లు, గౌన్లు, పాశ్చాత్య, సంప్రదాయ దుస్తువులతో చూపరులను కట్టిపడేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్‌లో కొందరి చూపులు మాత్రం వ్యాపారవేత్త నిదర్శన గోవాని గావిన్ మిగ్యుల్ దగ్గరే ఆగిపోయాయి. ఎందుకు అనుకుంటున్నారా? బర్జోజీ ఎంబ్రాయిడరీ భారతీయ సంప్రదాయ చీర కట్టుతో  గోవాని ఆకట్టుకున్నారు.

ఆమె ధరించిన చీరను వందమంది చేనేత వాళ్లు రూపొందించడం విశేషం... అయితే  గోవాని కట్టుకున్న చీరే కాకుండా... ఆమె మెడలోని హారం హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించి టాక్ ఆఫ్ ది వర్ల్‌గా నిలిచింది. ఇంతకి ఆమె ధరించిన హారం పేరేంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.. ఆమె వేసుకున్న జ్యువెల్లరీని కృష్ణ గువా నవరత్న హారం అని అంటారు. ఈ నవరత్న హారానికి వందేళ్ల చరిత్ర ఉంది. అంటే చాలా పాతది అన్నమాట. దీన్ని మీనా జాదౌ జ్వువెల్లరీ వ్యాపారి ఘనాసింగ్ బిట్రూ రూపొందించారు. ఈ నెక్లెస్ తయారికి 200 మంది కళాకారులు 1800 గంటలు కష్టపడ్డారు. అయితే పురాతన కటింగ్ పద్ధతిలో పోల్కీ వజ్రాలతో రూపొందించి నట్టుగా తయారీదారులు తెలిపారు.