calender_icon.png 27 November, 2024 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన రాజకీయం చేయాలి

27-11-2024 01:51:29 AM

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు 

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాజకీయ నాయకులు విలువలతో కూడిన రాజకీయం చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. అశోక చక్రం, సత్యమేవ జయతే, త్రివర్ణ పతాకంలోని విలువలను అమలు చేసేలా, భావి తరాలకు చాటిచెప్పేలా అందరూ కృషి చేయాలన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, మౌలిక జీవన విలువలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్యాంగం దారిచూపుతుందని అన్నారు. మంగళవా రం  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మన రాజ్యాంగం ఆధారంగానే దేశం ఫరిడవిల్లుతోందని ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయని తెలిపారు. గతంలో ప్రజల అవసరాల కు అనుగుణంగా రాజ్యాంగంలో సవరింపులు చేసుకున్నామన్నారు.

కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్ఛా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, జయశ్రీ, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.