calender_icon.png 5 November, 2024 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యలపై రాజకీయాలా?

23-04-2024 12:00:00 AM

ప్రస్తుత కరువు పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశమూ లేకపోలేదు. అలాగని, రైతన్నలు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కుటుంబాలను ఆగం చేసుకోవద్దు. మనందరం కలిసి బతుకుదాం. మీకు తెలంగాణ సమాజం అండగా ఉంది. ఈ మేరకు అందరం వారికి భరోసాను, ఆత్మవిశ్వాసాన్ని కల్పించవలసి వుంది.

తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజులుగా రాజకీయ పార్టీలన్నీ రైతు ఆత్మహత్యలపైన రాజకీయాలు చేస్తున్నాయి. భారీ నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రైతుకూడా ఆత్మహత్య చేసుకోలేదని మాట్లాడడం హాస్యాస్పదం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి అంటే 2023 డిసెంబర్ 9 నుండి 20-.04-.2024 వరకు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రైతు ఆత్మహత్యల సంఖ్య 88. ‘ఇవి రైతు ఆత్మహత్యలు కావు అనడం రైతుల చావులను అవమానించినట్లే’ అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. 

10.-12.-2021 రోజున మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్ గ్రామానికి చెందిన కరణం రవికుమార్ అనే రైతు అప్పటి ముఖ్యమంత్రికి ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకు న్నాడు. 24-.03.-202౧న మంచిర్యాల జిల్లా మల్కేపల్లి మండలం కాశిపేట గ్రామానికి చెందిన జంజీరాల రమేష్ అనే రైతు, కుటుంబసభ్యులు భార్య, బిడ్డ, కొడుకు నలుగురూ కలిసి ఉత్తరం రాసి సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవని స్వయంగా చాలా సందర్భాల్లో అన్న సంగతి అందరికీ తెలిసిందే. 

మాట మార్చడం భావ్యం కాదు

గతంలో కొందరు కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటుకు ముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు లేవనడం రైతులపట్ల నాయకులకు, ప్రభుత్వా నికి చిన్న చూపు ఉన్నట్లు లెక్క. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అబద్ధాలు మాట్లాడటం మంచిది కాదు. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చినాక ఇంకొక మాట అనడం సర్వసాధారణమై పోయింది. రైతు ఆత్మహత్య లపైన ఇలా రెండు నాలుకల ధోరణి సరైంది కాదు. ఎప్పుడైనా, ఎవరైనా జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ‘రైతు ఆత్మహత్యలు కాదనడాన్ని’ సమాజం హర్షించదు. నిజం ఒప్పుకుంటే  మంచిది.

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజుపల్లి గ్రామానికి చెందిన కంతుల పాపయ్య తనకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో గత 13 సంవత్సరాల క్రితం మూడు బోర్లు వేసుకొని, రెండు పంటలు పండించుకుంటున్నాడు. ఆ రైతుకు రెండుబోర్లు ఎండిపోవడంతో టమాట పంట ఎండిపోతుందని దానిని కాపాడుకోవాలని ఉద్దేశ్యంతో ఈనెల 5న వరుసగా 600 ఫీట్ల చొప్పున నాలుగు బోర్లు తవ్వించాడు. ఇందుకుగాను రూ. 3,85,000 ఖర్చు కాగా చుక్క నీళ్లు రాలేదు. పంట ఎండిపోయి అప్పుల పాలైన పాపయ్య, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన మరో రైతు ముక్కెర బాలరాజు తనకున్న రెండెకరాల పొలంలో గతంలో వేసిన రెండు బోర్లు ఎండి పోవడంతో వరి పంటకు నీళ్లు కరువయ్యాయి. అతను    11.-02.-2024న ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బొబ్బిలి దుర్గయ్య అనే దళితరైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో రెండు బోర్లు ఎండి పోవడంతో జనవరి 20న నాలుగు బోర్లు వేశాడు. అయినా, చుక్క నీళ్ళు రాకపోవడంతో ఉన్న పంట ఎండిపోవడం, అప్పులపాలు కావడంతో మరో మార్గం లేక దిక్కుతోచని స్థితిలో దుర్గయ్య 28-.01-.2024న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి కొన్ని ఉదాహ రణలు మాత్రమే. కానీ, ఈ సంవత్సరం ప్రతి గ్రామంలో సుమారు 20 శాతం యాసంగి పంటలు ఎండి పోవడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ముఖ్యంగా గత వానాకాలంలో అక్టోబర్ నెలలో కురిసిన తర్వాత మళ్లీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి.

దీనికి తోడు గోదావరి నదిపైన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కు చెందిన మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కృంగిపోవడంతో ప్రాజెక్టులలో నీళ్లు లేకపోవడం, కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేక నీళ్లు లేని పరిస్థితి. దీంతో రాష్ట్ర రైతాంగం మళ్లీ పది సంవత్సరాల తర్వాత పంటలు ఎండిపోయిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. పంటలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి బోర్లు వేస్తూ బోర్లలో నీళ్లు రాక, మరోవైపు అప్పులపాలవుతున్నారు. ఫలితంగా రైతులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేయడం బాధాకరం. 10 సంవత్సరాల తర్వాత బోరు వాహనాలు తెలంగాణలో రాత్రి, పగలు పంట పొలాల్లో తిరగడం చూస్తు న్నాం. ఇన్నేళ్ల తర్వాత మోటర్ వైండింగ్ షాపులూ తెర్చుకుంటున్నాయి.

ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి

ఈ కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువా? ప్రకృతి తెచ్చిన కరువా? గత ప్రభుత్వం తెచ్చిన కరువా? అనేది పక్కన పెట్టి ఇప్పుడు రైతాంగానికి బతుకుపై భరోసా ఇవ్వవలసిన ప్రధాన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పటి వరకు చేయక పోవడంతో బ్యాంకర్లు రైతులను డిఫార్టర్స్‌గా చూపి స్తూ నోటీసులు పంపిస్తున్నారు. నీటి కరు వు ఒకవైపు, అప్పుల భారం మరోవైపు, ప్రకృతి వైపరీత్యాలు ఇంకోవైపు రైతులను నిరంతరం కుంగదీస్తూనే వున్నా యి. భవిష్యత్తు మీద భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులదే. కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా రెండు లక్షల రుణమాఫీ వెంట నే చేసి, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి. పండి న ప్రతి గింజను మద్దతు ధరతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభు త్వమే కొనుగోలు చేయాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీవోఎంఎస్ నం.194 ప్రకారం ప్రతి కుటుంబానికి ౬ లక్షల రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నది.

(వ్యాసకర్త సామాజిక కార్యకర్త)

సెల్: 9908383567

వ్యవసాయ విధానం కావాలి

గత నెలలో నల్గొండ సభలో బిఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 208 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సభలో చెప్పారు. ఆ ఆధారాలను సీఎంఓకు పంపినట్లు ఆయనన్నారు. కెసిఆర్ అన్నట్లు రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. అటు ప్రతిపక్షమైనా ఇటు ప్రభుత్వమైనా రైతుల బతుకులకు భరోసానిచ్చే మాటలు మాట్లాడాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడే మాటలు మాట్లాడడం మంచిది కాదు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగవు. భారతదేశం వ్యవసాయిక దేశం. నూటికి 65% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ దేశంలో ఒక ‘వ్యవసాయ విధానం’ అంటూ లేకపోవడం దురదృష్టకరం. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 10 

సంవత్సరాలలో ఎన్‌సిఆర్‌బి 

(నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) 

రిపోర్ట్ ప్రకారం రైతు ఆత్మహత్యల వివరాలు ఈ విధంగా వున్నాయి. 

2004 2005 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014

మొత్తం సంఖ్య :16 వేలకు పైనే. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 

పది సంవత్సరాల్లో జరిగిన రైతు 

ఆత్మహత్యల వివరాలు ఇవీ: 

2014

2015 

2016 

2017 

2018 

2019 

2020 

2021 

2022 

(ఎన్‌సీఆర్‌బి రిపోర్ట్ ప్రకారం), 2023 2024 (20.04.2024 నాటికి), 

మొత్తం6 వేలకు పైనే.