- మహబూబ్‌నగర్ అభివృద్ధికి కృషి చేస్తాం
- ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి ప్రకటన
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): రాజకీయం రాజకీయమే.. అభివృద్ధి అభివృద్ధే అంటున్నారు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి. మొన్నటి వరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారు తొలిసారిగా కలిసి పర్యటించారు. పార్టీలు వేరైనా మహబూబ్‌నగర్ పార్లమెంట్, నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ప్రకటనలు చేశారు. సోమవాం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్ నందు రైల్వే అండర్ బ్రిడ్జి ఎల్లప్పుడు వర్షం పడితే అటు ఇటు దాటేందుకు వీలు లేకుండ పోతుందని ఎమ్మెల్యే యెన్నం, ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకువచ్చారు. రైల్వే ఆర్‌వోబీపై స్పందించిన ఎంపీ రైల్వే ఉన్నత అధికారులను సంప్రదించి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.