calender_icon.png 16 January, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయం అంటే లబ్ది కాదు సేవ..!

01-12-2024 07:32:43 PM

మల్లెల తీర్థనికి త్వరలో బీటీ రోడ్డు సాంక్షన్ చేస్తాం

సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివాసులకు రగ్గుల పంపిణీ

టీఎస్ జెన్కో విద్యుత్ పవర్ కేంద్రం పరిశీలన, రివ్యూ 

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క 

అచ్చంపేట (విజయక్రాంతి): నల్లమల ప్రాంతంలో ఉన్న ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఐటీడీఏను త్వరలో పూర్తిస్థాయిలో అభివృద్ధికి సిబ్బంది నియామకంపై దృష్టి సారిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీనభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం జిల్లాలోని నల్లమల్ల ప్రాంతంలో మంత్రి పర్యటించారు. ఐసిడిఎను పూర్తిస్థాయిలొ పునరుద్ధరణ విషయంపై ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పర్యటనలో ముందుగా ఈగల పెంటలోని పాతాళ గంగ వద్ద ఉన్న తెలంగాణ శ్రీశైలం జెన్కో సొరంగ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం విద్యుత్ అధికారులతో కలిసి రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. మల్లెతీర్థం గ్రామాన్ని సందర్శించి ఆదివాసీలతో మాట్లాడి... సిబిఎం ట్రస్ట్ చైర్మన్ మాజీ జెడ్పిటిసి చిక్కుడు అనురాధ ఆధ్వర్యంలో ఆదివాసీలకు రగ్గులు పంపిణీ చేశారు. 

రాజకీయం అంటే లబ్ధి కాదు సేవ...

రాజకీయమంటే స్వార్థం కోసం ఏదో సంపాదించుకుందాం లబ్ధి పొందుదామనుకుంటే ముమ్మాటికీ పొరపాటేనని.. ప్రజలకు సేవ చేసేందుకు ముందుండాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ  సిబిఎం ట్రస్టు ద్వారా అభివృద్ధిఫై దృష్టి కేంద్రీకరిస్తూనే.. సేవా దృక్పథంతో ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసి వర్గాలకు ఉచిత వైద్యం, ఆపరేషన్లు తదితర కార్యక్రమాలు చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆదివాసి గుడారాల్లో నివసించే చెంచులు ఇతరులు కాలానుగుణంగా వచ్చే వాతావరణం దృష్ట్యా రాత్రంతా నెగళ్లతో ఉంటూ.. దుర్భర జీవితాలు జీవిస్తుంటారని, అలాంటి వారి కోసం  సంక్షేమ పథకాలను అందించే కృషి చేస్తుందన్నారు. 

మల్లెల తీర్థనికి త్వరలో బీటీ రోడ్డు సాంక్షన్ చేస్తాం...

కొన్ని అటవీ శాఖ అడ్డంకుల చేత మల్లెల తీర్థానికి గతంలో రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ పూర్తి కాలేకపోయిందని, అట్టి రోడ్డును తిరిగి త్వరలోనే పూర్తి చేయిస్తామని, అందుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తామని, ఈ విషయంపై ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులతో చర్చించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసి గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పక్క గృహాలు నిర్మిస్తుందని, అచ్చంపేట ప్రాంతానికి మరిన్ని ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.