21-03-2025 12:00:00 AM
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్‌౨ఈ: ఎంపురాన్’ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ౨౦౧౯ లోవచ్చి మంచి సక్సెస్ సాధించిన ‘లూసిఫర్’ సినిమాకు ఇది సీక్వెల్. మూడు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఇది రెండో భాగం. తొలి భాగాన్ని మించిన ట్విస్టులు, టర్నులు, రాజకీయ వ్యూహాలు, పన్నాగాలు, వాటిని తిప్పి కొట్టే ప్రతి వ్యూహాలు, ధీటైన హీరోయిజం.. వావ్ అనిపించే సన్నివేశాలు, నిర్మాణాత్మక విలువలతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మార్చి 27న అందించనుందని ట్రైలర్‌తో మేకర్స్ క్లియర్ కట్‌గా చెప్పేశారు. ‘మనదేశంలో రాజనీతి ఓ వ్యాపారం’.. ‘దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్‌ను కాకుండా ఎవర్ని సాయం అడగగలం’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు. తొలి భాగాన్ని మించే పాత్రలను ఇందులో పరిచయం చేయబోతున్నారు.
కథానాయకుడు కాపాడుతున్న రాజ్యాన్ని కబలించటానికి బలవంతులైన శత్రు వులందరూ ఏకమై యుద్ధం చేయటానికి సిద్ధమైతే ఏం జరుగుతుంది? హీరో దాన్నెలా తిప్పి కొట్టి తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకున్నాడనేదే కథాంశమని ట్రైలర్‌లో తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సిని మాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకు లం గోపాలన్ నిర్మించారు. మలయాళ చిత్రసీమ నుంచి ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా ‘ఎల్2ఈ: ఎంపురాన్’ ప్రపంచ ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.