calender_icon.png 14 October, 2024 | 4:46 AM

దసరా వేడుకల్లో రాజకీయ రచ్చ!

14-10-2024 01:37:27 AM

అధికార, ప్రతిపక్ష నేతల ప్రవేశంతో అధికారుల ఉక్కిరి బిక్కిరి 

దుమారం లేపిన మున్సిపల్ చైర్మన్ ప్రోటోకాల్ వివాదం 

ఆదిలాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరహించిన దసరా వేడుకల్లో రాజకీయ రగడ రగులుకొంది. దసరా సందర్భంగా నిరహించే రావణ దహన కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల ప్రవేశంతో చిచ్చు రేపింది.

గతంలో ఎన్నడూలేని విధంగా హిందూ ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయాలు చోటుచేసుకోవడం చర్చనీయాం శంగా మారింది. గతంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధర్యంలో వేడుకలు జరిగేవి. గత పదేళ్లుగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధర్యంలోనూ ఉత్సవాలు జరుపుతున్నారు. ఈసారి దసరా వేడుకల్లో అధికార, ప్రతిపక్ష నాయకుల రాకతో అధికారు లు, పోలీస్‌లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.  

వేడుకల్లో ప్రొటోకాల్ దుమారం 

దసరా వేడుకల్లో ఈ సంవత్సరం ప్రొటోకాల్ వ్యవహారం దుమారం రేపింది. అధికారికంగా నిరహించే దసరా వేడుకల ఆహాన పత్రికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేరు లేకపోవడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. హిందూ ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయం చేయడమేంటని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్ ప్రశ్నించారు.  

నియంతలా ఎమ్మెల్యే పాయల్ శంకర్ : కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి 

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నియోజ కవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. అదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా వేడుకలను ఎమ్మెల్యే తన జాగీరుగా భావిస్తూ ఏకచిత్రాధిపత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పదవులు ఎప్పుడు శాశతం కాదని, కనీసం ప్రొటోకాల్  పాటించడం కనీస బాధ్యత అని అన్నారు.

వేడుకలకు రాజకీయ రంగు 

ఈసారి దసరా వేడుకలకు రాజకీయ రంగు పులుముకుంది. హిందూసమాజ్ ఉత్సవ సమితి, సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధర్యంలో ఒకే చోట వేడుకలు నిరహించాలని కొందరు బీజేపీ నాయకులు సమితి సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. రామ్‌లీలా మైదానం శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠానికి సంబంధించిన ఎండోమెంట్ స్థలం కావడంతో ఈసారి వేడుకలు రామ్‌లీలా మైదానంలో నిరహించవద్దంటూ పీఠాధిపతి యోగానంద సరసతి సామీజీ సైతం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులకు సూచించారు.

అయినా, సమితి సభ్యులు అదే మైదానంలో వేడుకలు నిరహించేందుకు ఏర్పాట్లు చేయగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. రావణ దిష్టిబొమ్మ దహనం కోసం ఏర్పాటు చేసిన కర్రలను కొందరు బీజేపీ యువ నాయకులు తొలగించడంతో వివాదం నెలకొంది. కాగా, సనాతన హిందూ సమితి సభ్యులు అధికార కాంగ్రెస్ నేతల మద్దతుతో మల్టీపర్పస్ గ్రౌండ్‌లో దసరా వేడుకలను నిరహించారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.