calender_icon.png 10 January, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబాబు రాకతో రాజకీయ ప్రకంపనలు

09-07-2024 02:07:30 AM

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ర్టంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్‌గౌడ్ అన్నారు.  సోమవారం మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు బాగుండాలని విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చంద్రబాబు నాయుడే చొరవ తీసుకుని, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. దీనిపై కొన్ని పార్టీలు ఏవేవో మాట్లాడుతున్నాయని, గతంలో  రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాధినేతలు కలిసి భోజనాలు చేశారే తప్ప విభజన సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు.