06-07-2024 12:44:35 AM
న్యూఢిల్లీ, జూలై 5: ఉత్తరప్రదేశ్‌లోని భోలే బాబా ఆశ్రమంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో బాబాల సామ్రాజ్యాలపై మరోసారి చర్చ మొదలైంది. ఎక్కడో అనామకులుగా జీవితాలు మొదలుపెట్టిన వ్యక్తులు తమకు తాముగా దైవ దూతలుగా ప్రకటించుకోవటం, మతం ముసుగులో అడ్డమైన ఆగడాలకు పాల్పడటం.. ఆ దారుణాలకు రాజకీయ నాయ కులు రక్షణ కవచాలుగా నిలబడటం.. చివరకు తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఈ బాబాలు ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎదగటం నిత్యకృత్యమవుతున్నది.
ప్రమాదాలు జరగకుండా సరైన చర్యలు తీసుకుంటారా అంటే అదీ ఉండదు. దీంతో వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2003 నుంచి 2024 వరకు దేశంలో తొక్కిసలాటల్లోనే ఏకంగా 1,376 మంది అమా యకులు బలయ్యారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారంపాటు హడావిడి చేయటం, ఆ తర్వాత అధికారులు బాబాలు కలిసిపోవటం.. దేశంలో అనాదిగా ఇదే జరుగుతోంది.
సకల సేవలు
భోలే బాబా మొదట ఓ అనామకుడే. కొన్ని కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని రికార్డులు చెప్తున్నాయి. అయితే, ఆయన భోలే బాబా అవతారం ఎత్తిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయన ముందు సాగిలపడింది. దళితుడైన భోలే బాబాకు యూపీలో లక్షలమంది అభిమానులున్నారు. ఈ ఓటు బ్యాంకుపై కన్నేసిన రాజకీయ పార్టీలు.. భోలే బాబాను ప్రసన్నం చేసుకొనేందుకు పోటీ పడ్డాయి. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోలే బాబా వైభోగమే వేరని అక్కడి వారు చెప్తున్నారు. ఆయన ఏకంగా ఎర్రబుగ్గ కార్లలో భారీ కాన్వాయ్‌తో తిరిగేవారట. అఖిలేశ్ హయాంలోనూ భోలేబాబా హవా కొనసాగింది.
అఖిలేశ్ స్వయంగా భోలే బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. భోలే బాబా ఆ శ్రమం అఖిలేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మె యిన్‌పురి లోక్‌సభ నియోజవర్గంలోనే ఉండ టం గమనార్హం. యోగి సీఎం అయిన తర్వా త కూడా భోలేబాబా వైభవం ఏమీ తగ్గలే దు. మొన్నటి తొక్కిసలాట తర్వాత కూడా ఆ యనపై కఠిన చర్యలు తీసుకొనేందుకు జంకుతున్నారంటే.. ఇలాంటి బాబాల శక్తి ఏమిటో అర్థంచేసుకోవచ్చు. ‘బాబాలు, రాజకీయ నా యకుల మధ్య బలమైన సంబంధాల వల్ల వా రు భారీ జనసమీకరణతో నిర్వహించే సభలు, సత్సంగ్‌లలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోయినా ఎవరూ ప్రశ్నించటంలేదు.’ అని రాజకీయ విశ్లేషకుడు ప్రీతం అభిప్రాయపడ్డారు.
వాళ్లు చేయరు.. చేయనివ్వరు
బాబాలు నిత్యం ఏదో ఒకచోట మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇవి ప్రజలకు మంచిని బోధించేవే.. కానీ ఈ కార్యక్రమాల నిర్వహణపై వారు ఏ మాత్రం శ్రద్ధ పెట్టరని విపత్తు నిర్వహణ నిపుణుడు సంజయ్ శ్రీవాస్తవ తెలిపారు. వేలమంది ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట ప్రమాదాలు జరుగుతుంటాయని ఆయన చెప్పారు. హత్రాస్ ఘటనలో బాబా పాద ధూళి కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తేల్చారు. కానీ, ఆ ప్రదేశాన్ని చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. 80 వేల మందితో సత్సంగ్ నిర్వహించేందుకు అనుమతి తీసుకొన్న నిర్వాహకులు.. ఏకంగా 2.5 లక్షల మందిని లోపలికి అనుమతించారు.
సమావేశ స్థలం మొత్తం బురద, నీటితో నిండిపోయి ఉన్నది. సరిపడా పందిళ్లు కూడా వేయలేదు. అంతమందిని నియంత్రించేందుకు ఆశ్రమ నిర్వాహకులు కనీసం ప్రయ త్నం కూడా చేయలేదు. ప్రజల హాహాకారాలు మొదలు కాగానే భోలే బాబా తన ప్రైవేటు సై న్యంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఇ ప్పుడు పోలీస్ విచారణతో పరిస్థితి కాకమీద ఉన్నప్పటికీ అతి త్వరలోనే అంతా చల్లారుతుంది. రాజకీయ నాయకులు ఆయనకు రక్షణగా ఉండకా మానరు. ఎటొచ్చీ బలయ్యేది నమ్మి వెళ్లే ప్రజలే. ప్రజల్లో మార్పు రానంత వరకు ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.