calender_icon.png 26 February, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు సజావుగా సాగేలా రాజకీయ పార్టీలు సహకరించాలి

25-02-2025 10:43:01 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఈనెల 27వ తేదీన జరగనున్న మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల పట్టబద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజసవ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న శాసనమండలి సభ్యుల పోలింగ్ కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని తెలిపారు. పోలింగ్ రోజున ఉదయం 8 గంటల కంటే ముందే పోలింగ్ ఏజెంటు కేంద్రాలకు హాజరయ్యాలా చూడాలని, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎం.ఎల్.సి. ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో కేటాయించడం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు ఎన్నికలను అప్పగిబ్బందిగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.