calender_icon.png 12 December, 2024 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన పార్టీలు ఇవే..

12-12-2024 05:01:10 PM

న్యూఢిల్లీ: వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశముంది. గతంలోనే జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. 2023 సెప్టెంబర్ లో జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటైంది. మార్చి 14న కోవింద్ కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. 18,629 పేజీలతో జమిలి ఎన్నికలపై కమిటీ నివేదిక ఇచ్చింది. తొలి దశలో లోక్ సభ, అసెంబ్లీలకు, రెండోదశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. జమిలి ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా తయారీకి సిఫారసు చేసింది. జమిలి ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి 18 సవరణలు సూచించింది. జమిలి ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు సానుకూలత వ్యక్తం చేయగా, 15 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. సానుకూలత వ్యక్తం చేసిన వాటిలో బీజేపీ, ఎన్ సీపీ, ఏఐడీఎంకే, బీజేడీ ఉండగా, జమిలి ఎన్నికలకు వ్యతిరేకించిన వాటిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, టీఎంసీ పార్టీలు ఉన్నాయి.