కామారెడ్డి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు పెద్ద ఎత్తున ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని పలు గ్రామాల నాయకులు మాజీ ఎమ్మెల్యే సురేందర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదే పూర్తి చేసుకున్నా అప్పుడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిందన్నారు. అనంతరం నాగిరెడ్డిపేట్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల కిష్టయ్య ఆధ్వర్యంలో వాడి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు.