calender_icon.png 27 December, 2024 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్‌లో రాజకీయ వేడి!

24-08-2024 12:00:00 AM

కె.రామకృష్ణ :

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల కు జమ్మూ, కశ్మీర్ సిద్ధమవుతోంది. వచ్చే నెల  జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో హిమాలయ రాష్ట్రంలో రాజకీయ వేడి సై తం మొదలైంది. 2019లో370 అధికర ణం రద్దుతో జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి జ రుగుతున్న ఈ ఎన్నికలకు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు దశల్లో పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 4న ఫలితాలు వె ల్లడవుతాయి.అక్టోబర్ నాటికి కశ్మీర్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని సుప్రీంకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమయింది.

దాదాపు పదేళ్లుగా రాష్ట్రంలో అ సెంబ్లీ ఎన్నికలు జరగని నేపథ్యంలో తాజా ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్పుడే సన్నాహాలు కూడా మొదలుపెట్టా యి. జమ్మూ, కశ్మీర్‌లో ఎన్నికయిన ప్రజాప్రభుత్వం కావాలని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చాలాకాలంగా డి మాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో  ఎన్నికలకు ఆ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో పాగా వేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు మొదలు పెట్టింది. 370 అధికరణం రద్దు తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు, వి ద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది కూడా.

హిందూ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న జమ్మూ ప్రాంతంలో బ లంగా ఉన్న కమలం పార్టీ  పీపుల్స్ కాన్ఫరెన్స్ లాంటి మిత్రపక్షాల తోడ్పాటుతో క శ్మీర్ లోయలోని రాజౌరీ, పూంఛ్ లాంటి జిల్లాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థానాల్లో విజ యం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరూ ఊ హించని రీతిలో పెద్ద ఎత్తున ఓటర్లు పో లింగ్‌లో పాల్గొన్నారు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం 19.16 శాతం పోలింగ్ జరగ్గా, 2024 ఎన్నికల్లో అది 58.46 శాతానికి చేరుకుంది.  వాస్తవానికి గత 35 ఏళ్లలో జమ్మూ, కశ్మీర్‌లో ఇంత భారీఎత్తున పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. గత ఆరేళుగ్లా రాష్ట్రంలో సాగుతున్న పాలన పట్ల జనం విసిగిపోయారని, కేంద్రం బలవంతంగా రుద్దిన అ ధికారుల పాలనకన్నా తాము ఎన్నుకున్న పాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనే దానికి ఇది నిదర్శనమని కశ్మీర్ యూనివర్సిలో మాజీ ప్రొఫెసర్, రాజకీ య విశ్లేషకుడు నూర్ అహ్మద్ బాబా అభిప్రాయ పడ్డారు. 

అధికారంపై బీజేపీ ధీమా

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తమ పార్టీ సి ద్ధంగా ఉందని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సత్పాల్ శర్మ అంటున్నారు. అన్ని స్థానాల కు అభ్యర్థులను నిలబడతామని చెప్తున్న ఆ యన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చా టామనికూడా ఆయన చెప్తున్నారు.  రా ష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను జమ్మూ ప్రాంతంలో 43 స్థానాలుం డగా, కశ్మీర్ లోయలో 47 స్థానాలున్నా యి. నియోజకవర్గాల పునర్విభజన తర్వా త జమ్మూ ప్రాంతంలో ఆరు స్థానాలు, కశ్మీర్ డివిజన్‌లో ఒక సీటు పెరిగాయి.

జ మ్మూ ప్రాంతంలో కనీసం 30కి పైగా స్థా నాలను దక్కించుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఒక ప్పుడు జమ్మూ ప్రాంతం కాంగ్రెస్‌కు కం చుకోటగా ఉండేది. అయితే బీజేపీప్రాబ ల్యం పెరగడంతో హిందువులు అధిక సం ఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్ర భావం క్రమేపీ మసకపారుతూ వచ్చింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని హస్తం పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఈ దిశగా ఆపార్టీ రాష్ట్రం లో ఒకప్పుడు అధికారంలో కొనసాగిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలాంటి పార్టీలతో ఎన్నికలతో పొత్తుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

బలమైన ప్రాంతీయ పార్టీలు

ఎవరు అవునన్నా కాదన్న జమ్మూ, క శ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీలు బలమైన స్థానిక పార్టీలన్నది వా స్తవం. ఈ రెండు పార్టీలు కూడా గతంలో రాష్ట్రంలో అధికారంలో కొనసాగినవే. అం దువల్లనే బీజేపీని దెబ్బతీసేందుకు ఈ రెం డు పార్టీలతో ఎన్నికల పొత్తుకోసం కాం గ్రెస్ ప్రయత్నిస్తోంది.  నేషనల్ కాన్ఫరెన్స్ తో సీట్ల సర్దుబాటు కోసం అప్పుడే కాం గ్రెస్ చర్చలు కూడా మొదలు పెట్టింది.  జ మ్మూ, కశ్మీర్‌లో రెండు రోజుల పాటు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల పర్యటన సమయంలోనే ఈ పొత్తుల చర్చలు మొదలయ్యాయి.

కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు దాదాపుగా ఖరార యినట్లు నేనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రక టించారు కూడా. ఇక పీడీపీతో పొత్తుల విషయంలోనే కాస్త సందిగ్ధత ఉంది. ఎం దుకంటే నేషనల్ కాన్ఫరెన్స్. పీడీపీలు రా ష్ట్రంలో చిరకాలంగా రాజకీయ ప్రత్యర్థులు గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పని చేయడం క్షేత్రస్థాయిలో కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పా ర్టీల ఉనికికన్నా, బలమైన ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కోవడానికి పొత్తు అనివార్యమని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో  నేరుగా పొత్తులు కాకపోయినా కొంతమేరకు రాజకీయ సర్దుబాట్లకు వీ లుండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  అయితే అసెంబ్లీ ఎన్నికలు కశ్మీ ర్‌కు  మేలు చేసేవిగా తాము భావించడం లేదని పీడీపీ అంటోంది. తమ పూర్వీకులు సాధించిన భారత్‌లో విలీనం ఆకాంక్షలు చెల్లాచెదరయ్యాయని, ముఖ్యంగా తమ ఆ కాంక్షలను లెక్క చేయకుండా  కేంద్రంలోని బీజేపీ 2019లో 370 అధిరణను రద్దు చే సిన తర్వాత  జరుగుతున్న ఈ ఎన్నికలు క శ్మీర్‌కు అనుకూలమైనవని తాము భావించడం లేదని పీడీపీ సీనియర్ నేత న యీ మ్ అఖ్తర్ అంటున్నారు.

కాళ్లు నరికేశాక ఊతకర్రలు అందించినట్లుగా తాము భావిస్తున్నామని ఆయన మండిపడ్డారు. ఎన్ని కలు నిర్వహించడానికి ముందు రాష్ట్రప్రతిపత్తిని ఎందుకు పునరుద్ధరించడం లేదని  కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించడం అనేది ఈసీ బాధ్యత అని, అయితే రాష్ట్రప్రతిపత్తిని పునరుద్ధరించడం అనేది కేంద్రం బాధ్యత అని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో లాగానే అసెంబ్లీ ఎన్నికల్ల కూడా 370 అధికరణం రద్దు, బీజేపీ రాజకీయాలు, వాటి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు అనేవే ప్రధానాంశాలుగా ఉం టాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రప్ర తిప త్తిని పునరుద్ధరించని పక్షంలో ఓటర్లు దా న్ని పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తారు. భూమిని, గుర్తింపును,వనరులును కాపాడుకోవడం, ఆర్టికల్ 370 అంశాలే ఈ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీల ప్రధానాంశాలుగా ఉంటాయని వారు అంటు న్నారు.

జమ్మూ, కశ్మీర్ రాష్ట్రహోదాను తిరి గి పొందేదాకా తాము ఎన్నికల్లో పోటీ చే యబోమని గతంలో మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ము ఫ్తీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పు డు అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేస్తారో లేదో వేచి చూడాలి. ఏది ఏమయినా రా బోయే వారం, పది రోజుల్లో రాష్ట్రంలో రా జకీయ ముఖచిత్రానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానితో పా టే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.