21-02-2025 12:16:56 AM
సంగారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గం ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. కేతకి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి నిర్వహిస్తారు. జాతర ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం కు పాలకమండలి లేకపోవడంతో భక్తులకు సరైన సౌకర్యాలు లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలే పాలక మండలి నియమకానికి అడ్డుగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పదవి కోసం పలువురు పోటీలో ఉన్న అధికార పార్టీ నియమకానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దేవాలయ అభివృద్ధి కోసం అధికార పార్టీ నాయకులు ఆసక్తి చూపకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో మాస్టర్ ప్లాన్ పనులు పెండింగ్ లో పడ్డాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కేతకీ ఆలయం అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.
రాజకీయ విభేదాలతోని పాలకవర్గం ఏర్పాటు కావడం లేదు...?
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం లో ఉన్న కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి పాలక మండలి లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో పాలకవర్గం ఉండడంతో పాటు కేతకి దేవాలయం లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు.
కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్ పదవి కోసం లింగాయత్, జంగమ సమాజంతో పాటు పలు వర్గాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. జహీరాబాద్ నియోజకవర్గం లో అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండడంతోనే చైర్మన్ పదవి నీ ఎంపిక చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
అధికార పార్టీలో సామాజిక వర్గాలుగా గ్రూపులు ఉండడంతో ఎవరికి వారు ఉంటున్నారు. కేతకి చైర్మన్ పదవిని లింగాయత్ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక వరం వారు ప్రయత్నం చేస్తున్నారు. మరో వర్గం వారు తమ వర్గానికి ఇవ్వాలని ప్రయత్నాలు చేయడంతో చైర్మన్ పదవి ఎంపిక కోలికి రావడం లేదని తెలిసింది.
పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధిపై ప్రభావం...!
రాష్ట్ర సరిహద్దుల్లో కర్ణాటక సమీపంలో ఉండడంతో ఎక్కువగా కర్ణాటక, మహా రాష్ట్రకు చెందిన భక్తులు దేవాలయానికి వస్తుంటారు. దేవాలయానికి భారీగానే భక్తులు కానుకలు వేస్తుంటారు . గతంలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ అమలు చేసేం దుకు ప్రభుత్వం అమలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మహాశివరాత్రి రోజు నిర్వ హించే జాతర ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుం టారు.
మహాశివరాత్రి రోజు దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా పాలకవర్గం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ ఏడాది పాలకవర్గం లేకపోవడంతో అధికారులే జాతర ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేం దుకు దేవాలయ ఆవరణలో ఉన్న అమృత గుండంలో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
పారిశుద్ధ్యం పనులు చేసేందుకు అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి అవసరమైన సిబ్బందిని నియమించాలని రెవెన్యూ డివి జన్ అధికారి రాం రెడ్డి అధికా రులకు ఆదేశాలు ఇచ్చారు. జహీరాబాద్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడంతో కేతికి ఆలయ నిర్వహణ అధికారులకు ఇబ్బం దులు తప్పడం లేదు.
పాలకవర్గం లేకపోవ డంతో అధికారులు జాతర ఉత్సవాలు పర్య వేక్షణ చేయవలసిన అవసరం ఉంది. భక్తు లు మహాశివరాత్రి అధిక సంఖ్యలో దేవాల యానికి వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ఏర్పాట్లు చేయవలసిన అవసరం అధికారులపై ఉంది. దేవాలయా నికి భారీగా ఆదాయం ఉన్న అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉంది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.