02-04-2025 12:41:19 AM
సంస్థానాదీశుల కట్టడాలు సంస్థాగతం
ఫిరంగి చుట్టు ఫ్లెక్సీలు
చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
గద్వాల, ఏప్రిల్ 01 ( విజయక్రాంతి ) : ప్రజల దాహర్తిని తీర్చిదిద్దెందుకు ఆ నాటి సంస్థానాదీశులు మెట్ల దిగుడు బావిని తవ్వించారు. ఆ బావి ఎంతోమంది గొంతులను తడిపింది. ఎర్రటి ఎండాకాలంలో తాగునీటి అవసరాలను తీర్చింది. సంస్థానా దిశల కాలం నుండి కూడా ఆ బావి ఎంతో కీర్తి ప్రఖ్యాతలను సొంతం చేసుకుంది.
ఒక దశలో గద్వాల ప్రాంతమంతా సంస్థానాదిశుల పరిపాలనలో నెలకొన్న వాటి అన్నిటిని ఒక్కొక్కటిగా తూడ్చి వేసేందుకు ప్రస్తా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చరిత్ర కలిగిన ఆనవాలను తుడిచివేస్తూ భూ ములను అమాంతం మింగేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గద్వాల నడిబొడ్డున కోట్ల విలువచేసే భావి స్థలాన్ని మింగేసినందుకు ఇతర భారీ వాహనాలతో మట్టిని పోసి చదును చేస్తున్నారు.
దాన్ని మరమ్మత్తు చేసి పర్యాటలకు చూపురులకు ఆకట్టుకునేలా గద్వాల కీర్తి ప్రతిష్టల ను పెంచే విధంగా మరమత్తు చేయాల్సింది పోయి కబ్జాదారుల చేతుల నలిగిపోతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చరిత్ర ఆనవాళ్లు మింగేసి ఈ ప్రాంత మనుగడ కూడా ము ప్పు తెచ్చే విధంగా కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులకు అధికార యంత్రాంగం దాసో హం అయ్యిందా అన్న చర్చ సైతం బహిరంగంగా వినిపిస్తుంది.
ఫిరంగి చుట్టు ఫ్లెక్సీలు .....
సంస్థానాల్సిన కాలంలో జరిగిన యుద్ధాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఫిరంగిని గద్వాల నడిబొడ్డున ఏర్పాటు చేశారు. ఆనాటి స్ఫూర్తిని చెప్పే విధంగా ఉన్న ఫిరంగి ప్రజలకు, పర్యాటకులకు కనిపించకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఫిరంగిచుట్టూ బ్యానర్లు, ఫ్లెక్సీ లను ఏర్పాటు చేస్తూ అవమానపరుస్తున్నారని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
అయిన సంబంధి త అధికార యంత్రంగా కూడా స్పందించకపోవడంతో గద్వాల చరిత్ర పూర్తిగా కనుమ రుగవుతుందని, మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఉన్నప్పటికి సంబందించిన అధికారులు నిత్యం కండ్ల ముందు కనిపిస్తున్న ఎవ రు పట్టించుకోవడం లేదని సామాజికవేత్తలు, పరిరక్షణ కమిటీ సభ్యులు పర్యాటకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలు పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు
కొత్త బావి కనుమరుగు అవుతున్న నేపథ్యంలో పురాతన కట్టడాల పరిరక్షణ సమితి, అధికార పార్టీ తో పాటు పలు పార్టీలు, అఖిల పక్షం సైతం మీడియా సమావేశాలను నిర్వహించి నిరసనను వ్యక్తం చేయడం తో పాటు కలెక్టర్ కు వినతి పత్రాన్ని సైతం అందచేస్తున్నారు.