30-01-2025 01:27:38 AM
మన ఇసుక వాహనం వల్ల గత పాలకులకు వాటాలు కట్
రైతుల ముసుగులో తెర వెనుక ఇసుక మాఫియా అడుగులు
పది రోజుల్లో 800 ట్రాక్టర్లకు బుకింగ్లు.. 220 ట్రిప్పుల డెలివరీ పూర్తి
స్థానిక రైతులు, గ్రామస్తులకు చేతినిండా ఉపాధి
ఉనికి కోసం పాకులాడుతూ ఇసుక మాఫియా గ్యాంగ్ గందరగోళం
నాగర్ కర్నూల్, జనవరి 29 (విజయ క్రాంతి): చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆ వ్యక్తి ఎవరికీ భయపడే అవసరం ఉండదు అచ్చం అలాగే నిబంధనల ప్రకారం సహజ సిద్ధంగా దొరికే ఇసుకను మన ఇసుక వాహ నం పేరుతో నిరుపేదలకు తక్కువ ధరకే ఇసుకను అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇసుక వాహనం పోర్టల్ ను ప్రారంభించింది.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రత్యేక చొరవ చూపి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సహకారంతో నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామ శివారులోని దుందుభి వాగు పరివా హక ప్రాంతంలో సుమారు 12 వందల క్యూబిక్ మీటర్ల సుమారు 42 ట్రిప్పుల ట్రాక్టర్ల ఇసుకను తోడి చట్ట ప్రకారం ట్రాక్టర్ల ద్వారా సామాన్యులకు సరఫరా చేసేందుకు మన ఇసుక వాహనాన్ని రూపకల్పన చేశా రు.
ఇందుకోసం జిల్లాలో ఆయా ప్రాంతాల ఇసుక ట్రాక్టర్ యజమానులు 15వేల డిడితో ఆ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తించిన ఇసుక రీచ్ నుండి ఐదు కిలోమీటర్ల లోపు వారికి 1,6 44, పది కిలోమీటర్ల లోపు వారికి 2,0 69, 15 కిలోమీటర్ల లోపు వారికి 2,4 94 చొప్పున ఇసుక ధర పలుకుతుంది. దీంతో పాటు ఇసుక రీచ్ లో ఇసుకను తోడే లేబర్ వారికి ఒక ట్రాక్టర్ ఇసుకను నింపితే 400 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.
దీంతోపాటు విలేజ్ డెవలప్మెంట్ ఫండ్, జీఎస్టీ, సీనరీస్ వంటి వాటి పేరుతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూర్తుంది. కాగా ఆ గ్రామ రైతులకు మహిళలకు కూలీలకు ఉపాధి దక్కాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ రీచ్ నుండి ఇసుకను తోడివేసే బాధ్యతను కూడా గ్రామస్తులకే అప్పగిస్తూ రీచ్ నుంచి బయటికి తీసుకొచ్చిన ఇసుకను నమోదు చేసుకున్న ట్రాక్టర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేసేందుకు అధి కారులు సన్నద్ధమయ్యారు.
ఇక్కడ కూడా మరోసారి లేబర్ చార్జీలు రైతులకు కూలీల కు అందే అవకాశం ఉంది. దీంతో ఆ గ్రామ పరిసర రైతులు, కూలీలకు చేతినిండా ఉపా ధి దొరుకుతుంది. మన ఇసుక వాహనం పథకం ప్రారంభమైన పది రోజుల్లోనే సు మారు ఎనిమిది వందల ట్రాక్టర్ల ఇసుకకు దరఖాస్తులు రాగా ఇప్పటికే 220 ట్రాక్టర్ల ఇసుకను దరఖాస్తు చేసుకున్న వారి గమ్య స్థానాలకు చేర్చారు.
ఇసుక రీచ్ వద్ద రాజకీయ ఎజెండా...
ఇక్కడే గత బిఆర్‌ఎస్ హయాంలో రాత్రి పగలు అని తేడా లేకుండా సహజ సిద్ధంగా దొరికే ఇసుకను వాగుల నుండి తరలించి అడ్డగోలుగా సంపాదనకు అలవాటు పడిన వారంతా ఈ పథకం అమలైతే వారికి మను గడ ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళనతో సమీప రైతులను గొడవలకు ప్రేరేపిస్తున్నట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
అక్రమ ఇసుక దందా వ్యవహారం నడిపే మాఫియా గ్యాంగ్ తెరవెనక వారికి సహకారం అంది స్తూ మన ఇసుక వాహనం అమలు కాకుం డా అనేక కుట్రలకు తెరలేపుతున్నట్లు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఇసుక మాఫియా గ్యాం గ్ ఎలాంటి పొల్యూషన్, పర్మిట్ అనుమతు లు లేని ట్రాక్టర్ల ద్వారా కనీసం డ్రైవింగ్ లైసెన్సులు లేని మైనర్ల ద్వారా అడ్డగోలుగా రోడ్లపై నడుపుతూ అమాయక ప్రజల ప్రా ణాలను బలిగొన్న దాఖలాలు కూడా ఉన్నా యి.
అధికార పార్టీ లోనే ఉన్న ఓ మాజీ కౌన్సిలర్ భర్తతోపాటు మరో కౌన్సిలర్లు, తెలకపల్లి ప్రాంతానికి చెందిన మరికొందరు తెరవెనుక రైతుల పేరుతో మన ఇసుక వాహనాన్ని అడ్డుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత నాలుగు రోజులుగా నడిగడ్డ ప్రాంతం లో వంటావార్పు వాహనాల అడ్డగింత వంటి కార్యక్రమాల వెనక ఇసుక మాఫియా గ్యాంగ్ ఉన్నట్లు బాహాటంగా చర్చ నడుస్తుం ది. ఈ పథకం సక్రమంగా అమలయితే రెవెన్యూ, సర్కిల్ పరిధిలోని పోలీస్, మైనిం గ్, తదితర ప్రధాన శాఖలన్నింటికీ కూడా నెలవారి మామూలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మన ఇసుక వాహనాన్ని అడ్డు కునేందుకు వారు కూడా సహకారాన్ని అందిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.