calender_icon.png 27 December, 2024 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఓ రాహుల్ అనుసరించే విధానాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం

02-12-2024 11:31:53 PM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గిరిజన విద్యార్థిని విద్యార్థుల విద్యా బలోపేతం కావడానికి ఐటీడీఏ పీవో బి.రాహుల్ అనుసరిస్తున్న విధి విధానాలు గిరిజన పిల్లల విద్యాభివృద్ధికి ఎంతో ఉపకరిస్తాయని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు టేకులపల్లి మండలంలో పర్యటనలో భాగంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ఉద్దీపకం పుస్తకములు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన బాలబాలికల విద్యాభివృద్ధి పరంగా విద్యార్థులు సులభంగా వివిధ రకాల పాఠ్యాంశంలు సులభంగా నేర్చుకోవడానికి ఈ ఉద్దీపకములు ఎంతో దోహదం చేస్తాయని, ఉపాధ్యాయులందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఉద్దీపకంలోని అంశాలను పిల్లల చేత తప్పనిసరిగా అర్థమయ్యేలా బోధించి వారి చేత రాయించాలని అన్నారు. అంతకుముందు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ టేకులపల్లి మండలంలోని ముత్యంపాడు లోని జిపిఎస్ పాఠశాల, కోయగూడెంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారము సమయానుకూలంగా బ్రేక్ ఫాస్ట్ నుంచి మొదలుకొని డిన్నర్ వరకు వేడివేడిగా ఆహారము వడ్డించాలని, గిరిజన పిల్లల విద్యాభివృద్ధి కొరకు ఐటీడీఏ ద్వారా సరఫరా చేసిన ఉద్దీపకంలు బుక్ లెట్స్ తప్పనిసరిగా పిల్లల చేత రాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.