ఆరు స్పోర్ట్స్ బైక్‌లు సీజ్
రాజేంద్రనగర్, అక్టోబర్ 6: బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్న యువకులపై రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసు లు కొరడా ఝులిపించారు. ఆరు బైకులను సీజ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ బిల్లా కిరణ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో కొందరు యువకులు స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్‌లకు పాల్పడుతూ మితిమీరిన వేగంతో మిగతా వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ కిరణ్ సిబ్బందితో డెయిరీ ఫారమ్ చౌరస్తాలో శనివారం రాత్రి బైక్ రేజింగ్‌లకు పాల్పడుతున్న 4 స్పోర్ట్స్ బైక్ లు, అదేవిధంగా ఆదివారం ఉదయం మరో ౨ స్పోర్ట్స్ బైక్‌లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. వాహనాలను నడుపుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.