అమీన్‌పూర్‌లో క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
పటాన్‌చెరు, నవంబర్ 29: పోలీసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్ర భద్రత, పురోగతి పోలీసుల చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమీన్‌పూర్ టీజీ ఎస్‌ఫీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 265 మంది క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
క్యాడెట్లు చేసిన కవాతును వీక్షించారు. అనంతరం వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్యాడెట్లకు మెడల్స్, బహుమతులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ... “పాసింగ్ అవుట్ పరేడ్‌తో కొత్త బాధ్యతలు చేపట్టబోతున్న 265 మంది క్యాడెట్లకే కాకుండా రాష్ట్రం మొత్తానికి ఇది ముఖ్యమైన రోజు.
మీ కలలను సాకారం చేసుకొని రక్షకులుగా రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షులుగా మారుతున్న మంచి రోజు. మీ విధులను సమర్థవం తంగా నిర్వహించండి’ అని అన్నారు.
అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయ త్వంలో నెలకు సగటున 5వేల చొప్పున సంవత్సరంలో 50వేల పైచిలుకు ఉద్యోగాలను కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎస్‌పీఎఫ్ ఐజీ అనిల్ కుమార్, హోంశాఖ స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా, పోలీస్ అధికారులు, క్యాడెట్లు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.