calender_icon.png 25 February, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్ చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీసు వాహనం బోల్తా

25-02-2025 02:10:36 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): పటాన్ చెరు  ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీసు వాహనం బోల్తా పడి పోలీసులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కు చెందిన పోలీసులు సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఘటన ఘటన చోటు చేసుకుంది. పటాన్ చెరు  ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీసు వాహనం టైరు బ్లాస్ట్ కావడంతో వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన వాహనం సైబరాబాద్ కమిషనరేట్ కు చెందినదిగా పోలీసు వాహనంగా గుర్తించారు.