మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ క్రాస్ రోడ్డులో బుధవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్ వాహనదారులతో మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి తప్పని సరిగా రిజిస్ట్రేషన్, భీమా పత్రాలు, వాహనదారులకు లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పని సరిగా వినియోగించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, ర్యాష్ డ్రైవింగ్, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తమ వెంట అన్ని ధృవ పత్రాలు ఉంచుకోవాలన్నారు. తనిఖీల్లో ఏడూళ్ళ బయ్యారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.