మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో భోగి వేడుకల సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి మణుగూరు సిఐ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో సిఐతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.