09-04-2025 01:40:57 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): అంతర్జాతీయ స్థాయిలో క్రూడా యిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడిన ట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు.
మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వ ర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి.
ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పదకొండు సంవత్సరాలలో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడా నికి అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాల ను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పైడిపల్లి రాజు,కిన్నెర మల్లవ్వ,సాయవేణి రాయమల్లు, బ్రామండ్ల పెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు,బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి, నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు