27-03-2025 10:04:49 AM
ఆరుగురుతో పాటు ఇద్దరు జర్నలిస్టులు
కామారెడ్డి,(విజయక్రాంతి): పదో తరగతి గణిత పరీక్ష ప్రశ్నలు బయటకు పంపిన కేసులో 8 మందిని పోలీసులు(Police) గురువారము తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పరీక్ష కేంద్రం నిర్వాహకులతో పాటు ఇద్దరు జర్నలిస్టుల పాత్ర ఉన్నట్లు పోలీసులు పేరు కుంటున్నారు. 24 గంటల్లోనే బాధ్యులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరికొద్ది గంటల్లో వారి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశాలున్నాయి. కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత పరీక్ష పేపర్ లోని కొన్ని ప్రశ్నలను చిత్తు కాగితంపై రాసి బయటకు పరీక్ష కేంద్రం సిబ్బందితో పంపించి వివిధ మాధ్యమాలలో ప్రచారం చేశారని ఇద్దరు జర్నలిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో జర్నలిస్టుల పాత్ర ఉందా కావాలని కేసులో ఇరికించారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు వివరాలు వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే..