calender_icon.png 3 January, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల ఆంక్షలు

31-12-2024 11:40:40 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): పాత సంవత్సరానికి విడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు రోడ్డు వినియోగదారుల భద్రతను దృష్ట్యా డిసెంబర్ 31  రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు  ట్రాఫీక్ ఆంక్షలు విధించారు.  రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ఠమైన ఏర్పాటు చేసింది. నగరంలోని పలు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ విక్రేతలు, వినియోగదారులపై కఠిన చర్యలు ఉంటాయని మూడు కమిషనరేట్ల సీపీలు వెల్లడించారు.

రాత్రి 10  గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయబడుతాయని, రాత్రిపూట భారీ వాహనాలకు, విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే ఓఆర్ఆర్ పై అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామాని అధికారులు హెచ్చరించారు. ఇవాళ డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్చులు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను పొడింగించారు. మెట్రో రేపు అర్ధరాత్రి 12:30కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి రాత్రి 1.15 గంటల వరకు డెస్టినేషన్ స్టేషన్‌ చేరుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్  రెడ్డి పేర్కొన్నారు.