calender_icon.png 26 December, 2024 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బుల కోసం కొట్టుకున్న పోలీసులు?

05-11-2024 12:53:03 AM

నెక్కొండలో లంచం తెచ్చిన తంటా!

జనగామ, నవంబర్ 4 (విజయక్రాంతి): వచ్చిన లంచంలో తనకు వాటా ఇవ్వనందుకు ఓ పోలీసుతో మరో పోలీసు గొడవకు దిగాడు. నీకెందుకు ఇవ్వాలని ఒకరు... నాకూ సగం ఇవ్వాలని మరొ కరు ప్రశ్నించుకోవడంతో మొదలైన లొల్లి గల్లాలు పట్టుకునే దాకా వెళ్లినట్లు సమాచా రం. హనుమకొండ జిల్లాలోని నెక్కొండ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని రోజులుగా ఎస్సై అందుబాటులో లేరు. ఆయన సెలవుపై వెళ్లడంతో హెడ్ కానిస్టేబుళ్లే కొన్ని కేసులను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ హెడ్  కానిస్టేబుల్ ఇటీవల ఓ కేసు విచార ణ చేపట్టగా.. ఇదే కేసుకు సం బంధించి ఫిర్యాదుదారులు కొం త డబ్బు మరో హెడ్ కానిస్టేబుల్‌కు ఇచ్చినట్లు సమాచారం.

ఆ డబ్బుల విషయంలో తనకూ వాటా ఇవ్వాలని విచారణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కోరాడు. నీకెందుకు డబ్బులు ఇవ్వాల ని మరో హెడ్ కానిస్టేబుల్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పోలీస్ స్టేషన్‌లోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గొడవ కాస్తా ముదిరి ఒకరిపై మరొకరు చేయి వేసుకునే వరకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో డీసీపీ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.